భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వేముగుంటలో 6 ఎకరాల భూ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలతో తాజా అఫిడవిట్ దాఖలు చేయాలని జిల్లా ఎస్పీకి మంగళవారం రోజున హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ భూవివాదానికి సంబంధించి సివిల్ కోర్టులో ఉన్న కేసు వివరాలనూ సమర్పించాలని ఆదేశించింది.
సివిల్ వివాదంలో పోలీసులు .. స్పందించిన హైకోర్టు - bhadradri kothagudem district latest news
సివిల్ వివాదంలో పోలీసులు తలదూర్చడంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. బాధితుని భార్య గవర్నర్కు లేఖ రాయగా... దాన్ని తమిళిసై హైకోర్టుకు పంపారు.
High Court has responded
తదుపరి విచారణను సెప్టెంబరు 1వ తేదీకి వాయిదా వేసింది. సివిల్ వివాదంలో తన భర్త, మామలను పోలీసులు పిలిపించి వేధింపులకు గురిచేశారని, తలపై తుపాకీ పెట్టి ఆ భూమిలోకి వెళ్లకూడదని బెదిరించారని కొండూరు ఈశ్వరమ్మ రాసిన లేఖను గవర్నర్ తమిళిసై.. హైకోర్టుకు పంపారు. ఈ లేఖను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఇదీ చదవండి:PRAGATHI: రాష్ట్రవ్యాప్తంగా పదిరోజుల పాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు