వ్యవసాయ మార్కెట్ యార్డు ద్వారా రైతులకు ఖచ్చితమైన ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు.
'రైతులకు ఖచ్చితమైన ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి' - minister puvvada at wyra market yard
వైరాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మార్కెట్ యార్డులలో రైతులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సీసీఐ కేంద్రాల ద్వారా పత్తికి మద్దతు ధర అందిస్తున్నామన్నారు. మార్కెట్ యార్డు పాలకమండలి సభ్యులు తొలి ఏడాది పదవీకాలాన్ని సక్రమంగా నిర్వహిస్తే.. రెండో ఏడాది పొడిగింపు ఉంటుందని తెలిపారు. అన్నివేళలా రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు రాములు నాయక్, వెంకటవీరయ్య, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.