ఖమ్మం జిల్లా కారేపల్లిలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. సమావేశం ప్రారంభం కాగానే అధికారులు తమ నివేదిక వినిపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హక్కు పత్రాలు ఉన్న పోడు దారులు మాత్రమే పొలాలు సాగు చేయాలని డీఆర్ఓ ఎల్లయ్య పేర్కొన్నారు. ఇంతలో ఎంపీటీసీలు, సర్పంచ్లు కల్పించుకొని పోడు సాగు చేసుకుంటున్న పేదలందరికి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2005కు పూర్వం నుంచి సాగు చేసుకుంటున్న గిరిజనులకు నేటికీ హక్కు పత్రాలు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్ సభ్యులు, సర్పంచులు, అటవీశాఖ డీఆర్ఓ వాదనలతో సభ దద్దరిల్లింది.
ఖమ్మం జిల్లా కారేపల్లిలో పోడు భూముల రసభస
పోడు సమస్యలపై ఖమ్మం జిల్లా కారేపల్లిలోని మండల పరిషత్ సమావేశం గందరగోళంగా మారింది. పూర్వం నుంచి సాగు చేసుకుంటున్న వారికి హక్కు పత్రాలు తక్షణమే మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.
ఖమ్మం జిల్లా కారేపల్లిలో పోడు భూముల రసభస
TAGGED:
podu