ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ... ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మేజర్ పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన... ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు.
'తల్లాడను ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలి'
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి... ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మల్లవరం రహదారిలో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసిన ఆయన... అధికారులకు పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య పనులు, హరితహారం వంటి కార్యక్రమాలు నూటికి నూరు శాతం చేపట్టి... తల్లాడ మేజర్ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
మల్లవరం రహదారిలో పారిశుద్ధ్య పనులు తనిఖీ చేసి... అధికారులకు పలు సూచనలు చేశారు. మురుగు కాలువలు, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు, హరితహారం వంటి కార్యక్రమాలు నూటికి నూరు శాతం చేపట్టి... తల్లాడ మేజర్ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'ప్రతిఒక్కరికీ సంక్షేమం.. కేసీఆర్‌తోనే సాధ్యం'