పుల్వామాలో జవాన్లపై దాడిని ఖండిస్తూ ఖమ్మం పెన్షనర్స్ సంఘం ర్యాలీ పుల్వామా ఘటనలో మృతిచెందిన జవాన్లకు ఖమ్మం పెన్షనర్స్ సంఘం నివాళి అర్పించింది. నగరంలోని పెన్షన్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. భారత జవాన్లపై దాడి చేసిన ముష్కరులకు బుద్ధి చెప్పాలని కోరారు. జోహార్ జోహార్ వీర జవాన్లకు జోహార్ అంటూ నినాదాలు చేశారు.