తెలంగాణ

telangana

ETV Bharat / state

'మున్సిపల్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించండి' - mla sandra venkataveeryya

అభివృద్ధి చేస్తున్న తెరాసకే ప్రజలు పట్టం కట్టాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలో జరిగిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్ని గెలిచిన వారికి బహుమతులు అందించారు.

sattupalli mla sandra venkataveeryya on trs candidates
'మున్సిపల్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించండి'

By

Published : Jan 17, 2020, 11:42 AM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని చింతలపాటి వీధిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెరాస ఎన్నికల గుర్తు, సేవ్​గర్ల్​, సంక్రాంతి పండుగను ప్రతిబింబించే ముగ్గు, కేసీఆర్ చిత్రపటంతో వేసిన ముగ్గులు అలరించాయి. అనంతరం విద్యార్థులతో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.

'మున్సిపల్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించండి'
సత్తుపల్లిలో 23 వార్డులకుగాను ఆరు వార్డుల ప్రజలు తెరాసకు ఏకగ్రీవం చేశారని... మిగిలిన వార్డుల్లో తెరాస అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details