ఖమ్మం జిల్లాలోని వివిధ బస్ స్టేషన్ నుంచి బస్సుల పున:ప్రారంభం కావడం వల్ల ప్రయాణికులు కాస్త ఊరట చెందారు. ప్రధానంగా హైదరాబాద్,వరంగల్ , మహబూబాబాద్,భద్రాచలం, కొత్తగూడెంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు లాక్డౌన్ నాటినుంచి ఇబ్బందులు పడుతున్నారు.
'ప్రజా'రవాణాతో కాస్త ఊరట - Khammam district RTC services start
లాక్డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు... రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లాలోని వివిధ డిపోల నుంచి ఉదయం 6 గంటలకే వివిధ రూట్లకు బస్సులు బయల్దేరాయి.
ప్రైవేటు వాహనాలలో ప్రయాణం క్లిష్టంగా మారడం వల్ల బస్సుల రాకతో జిల్లాలోని వివిధ బస్టాండ్లకు ప్రయాణికుల తాకిడి మొదలైంది. లాక్డౌన్ నిబంధనలు ప్రకారం డిపోల్లోనే బస్సులను శానిటైజ్ చేసి పంపిస్తున్నారు. అలాగే ప్రయాణికులు చేతులను శుభ్రం చేసుకునేందుకు కండక్టర్లు శానిటైజర్ అందజేస్తున్నారు. మాస్కులు ధరించని వారిని బస్సులోకి అనుమతించడంలేదు. ఇతర రాష్ట్రాలకు బస్సులను నడపలేదు. బస్సులు తిరిగి సాయంత్రం 7 గంటల వరకు డిపోల్లోకి చేరే విధంగా ప్రణాళికలను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.