ఖమ్మం ఎస్సీ వసతి గృహం అగ్ని ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థిని స్పందన కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఉదయం కలెక్టర్‌ను కలిసిన ఆయన 12 అంశాలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ తాము చెప్పిన అన్ని అంశాల పట్ల సానుకూలంగా స్పందించారని మంద కృష్ణ తెలిపారు. కుటుంబానికి 5లక్షల పరిహారం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం, భూమి ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు.
'స్పందన కుటుంబానికి న్యాయం చేయాలి' - mandha krishna
ఎస్సీ వసతి గృహం అగ్ని ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థిని స్పందన కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.
వినతి పత్రం ఇస్తున్న మందకృష్ణ