తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకా చౌదరి

అత్యధిక మంది కాంగ్రెస్​ ఆశావహులు దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గం ఖమ్మం. సీనియర్​ నేతలంతా ఆ లోక్​సభ స్థానంవైపే మొగ్గు చూపారు. అక్కడైతేనే సులభంగా గెలుస్తామని అంచనా వేశారు. చివరకు హస్తం పార్టీ రేణుకా చౌదరిని ఎంపిక చేసింది.

renukha

By

Published : Mar 23, 2019, 7:22 AM IST

Updated : Mar 23, 2019, 8:40 AM IST

ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థిగా రేణుకా
ఖమ్మం లోక్​సభ స్థానానికి కాంగ్రెస్​ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని ఆ పార్టీ ప్రకటించింది. ఇప్పటికే 16 లోక్​సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం నియోజకవర్గానికి రేణుకా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త రవిచంద్ర మధ్య పోటీ నెలకొనడం వల్ల ప్రకటన ఆలస్యమైంది.

తెరాస టికెట్​ దక్కని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును ఓ దశలో పరిశీలించారు. ఆయన నుంచి స్పందన లేకపోవడం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారు. రవిచంద్ర గత శాసనసభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోవడం... స్థానికేతరుడు కావడం వల్ల ఆయన పేరును తొలగించారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పేరును ఆఖరి నిమిషం వరకు పరిశీలించారు. అన్ని కోణాల్లో కసరత్తు చేసిన కాంగ్రెస్​ అధిష్ఠానం రేణుక వైపు మొగ్గుచూపింది.

Last Updated : Mar 23, 2019, 8:40 AM IST

ABOUT THE AUTHOR

...view details