ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్లలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీయటం వల్ల పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొనిజర్ల మండలం తుమ్మలపల్లిలో విద్యుత్ తీగలు పూరిల్లుపై పడటం వల్ల మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. ధాన్యం, సామగ్రి, దుస్తులు ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.
ఖమ్మం జిల్లాలో గాలివాన బీభత్సం - వైరా
వైరా, కొణిజర్లలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెద్దఎత్తున వీచిన గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి.
గాలివాన బీభత్సం