తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదుకోవాలంటూ ప్రైవేట్​ ఉపాధ్యాయుల ధర్నా - ప్రైవేట్​ అధ్యాపకుల ధర్నా

కరోనా కారణంగా పాఠశాలలు మరోసారి మూసివేయడంపై ప్రైవేట్​ ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని.. విద్యాసంస్థలను ప్రారంభించాలని డిమాండ్​ చేస్తున్నారు. తాజాగా ఖమ్మం ధర్నాచౌక్​ వద్ద ప్రైవేట్​ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు.

private teachers protest, khammam news
ప్రైవేట్​ ఉపాధ్యాయుల ధర్నా, ఖమ్మం వార్తలు

By

Published : Mar 28, 2021, 1:27 PM IST

తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఖమ్మం ధర్నాచౌక్​ వద్ద ప్రైవేట్​ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ధర్నా నిర్వహించారు. తమకు ప్రభుత్వం నెలవారి భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థలు మూతపడడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు గౌస్ ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యాసంస్థలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్నామని ఉపాధ్యాయులు వాపోయారు. ప్రభుత్వం లాక్​డౌన్ విధించినప్పటి నుంచి వేతనాలు లేక ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: ఎంపీ సోయం బాపూరావుపై చర్యలు తీసుకోవాలి: జాతీయ బంజారా మిషన్​

ABOUT THE AUTHOR

...view details