ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. కేవలం కమిషన్ల కోసం సాగునీటి ప్రాజెక్టులకు మాత్రమే కోట్ల నిధులు విడుదల చేస్తూ సంక్షేమ పథకాలకు కేటాయింపులు విస్మరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్పై ధ్వజమెత్తారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు అర్హులకు మొండిచేయి చూపిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులకు భృతి ఇస్తానని చెప్పిన హామీని అమలు చేయడం లేదన్నారు. త్వరలో నిరుద్యోగులతో సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగివేసారి ఉన్నారని పేర్కొన్నారు.
'నిరుద్యోగ భృతి హామీ అమలు లేదు' - మల్లు భట్టి విక్రమార్క
ప్రజాసంక్షేమానికి పాటుపడతానని చెప్పి అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను తీవ్రంగా వంచిస్తున్నారని మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నిరుద్యోగ భృతి హామీ అమలు లేదు'