కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో రేషన్ బియ్యం కలకలం రేపింది. ప్రతినెలా మాదిరిగానే డిసెంబర్ 6న రేషన్ దుకాణం నుంచి బియ్యం తెచ్చుకొని మంగళవారం ఉదయం వండుకొని తిందామనుకున్నారు బోయిని శ్రీకాంత్. ఈ రోజు ఉదయం తన భార్య రేషన్ బియ్యం అన్నం వండి టమాటా కూరతో శ్రీకాంత్‌కు అన్నం పెట్టగా... కూర శ్రీకాంత్‌కు నచ్చలేదు. అయితే ఉత్త అన్నాన్నే కలుపుతుండగా.... బంతి మాదిరిగా ముద్ద గట్టిగా అయింది. అనుమానం వచ్చి ముద్దను నేలమీద కొట్టగా అన్నం బంతిలా ఎగిరింది.
పండించిన బియ్యం నేలకు అతుక్కుపోతోంది
అవాక్కయైన శ్రీకాంత్ పక్కింటి వారికి చూపించాడు. రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండవచ్చని కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం శ్రీకాంత్ ఇంట్లోనే కాకుండా చుట్టుపక్కల ఐదారు ఇళ్ళల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పండించిన బియ్యంతో అన్నం చేసి చూద్దామనుకొని వండి ముద్దలా చేసి నేలకు కొట్టగా అది నేలకు అతుక్కుపోయింది.
రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిసిందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు మంచి బియ్యాన్ని అందించాలని కోరుకుంటున్నారు. వెంటనే రేషన్ బియ్యంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
రేషన్ బియ్యంతో ప్లాస్టిక్ బంతి చేసుకోవచ్చు ఇవీ చూడండి: 'కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణకు ఓ మకుటాయమానం'