ఖమ్మం జిల్లా మధిర మండలం నాగవరప్పాడు గ్రామానికి చెందిన రమాదేవి అదే గ్రామానికి చెందిన గోపికృష్ణ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. రమాదేవి టీటీసీ పూర్తిచేసి డిగ్రీ చదువుతోంది. అయితే గోపీకృష్ణకు సంవత్సరం క్రితం ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి గోపీకృష్ణ కొత్తగూడెంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం వచ్చింది కాబట్టి ఎక్కువ కట్నం ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చనే దురాశతో ప్లేటు ఫిరాయించాడు గోపీకృష్ణ. వేరే పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు.
ఉద్యోగానికి ముందు... తర్వాత... - LOVER SUCIDE
నాలుగేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. నువ్వు లేకపోతే బతకలేను పెళ్లిచేసుకుందామంటూ ఆమెకు ఆశ కల్పించి చివరకు నట్టేట ముంచాడో కానిస్టేబుల్. తీవ్ర మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
విషయం తెలుసుకున్న యువతి గోపీకృష్ణను నిలదీయగా... నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుని చనిపోతానంటూ యువతిని బెదిరించాడు. గ్రామ పెద్దల సమక్షంలో కూడా యువతిని నిరాకరించాడు. ఎంత చెప్పిన ప్రియుడు వినడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరుగుతున్న సమయంలోనే గోపీకృష్ణ వేరే యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. విషయం తెలిసిన రమాదేవి తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: కొండగట్టులో ముగిసిన హనుమాన్ జయంతి ఉత్సవాలు