రాష్టానికి సంబంధించిన సమస్యలను పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినట్లు ఖమ్మం తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. విభజన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. కశ్మీర్ ప్రజల అభివృద్ధి కోసం 370 రద్దు బిల్లుకు మద్దతు తెలిపామన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పార్లమెంటులో పోరాడుతామని నామ స్పష్టం చేశారు.
రాష్ట్ర సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం - ఎంపీ నామా నాగేశ్వర రావు
రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఖమ్మం తెరాస ఎంపీ నామ నాగేశ్వర రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి అడిగినట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం
ఇవీ చూడండి: రైల్వే స్టేషన్లో మహాత్ముడి ఛాయాచిత్ర ప్రదర్శన