రాష్ట్రమంతా ఎంపీపీ పీఠాలు తెరాస ఏకపక్షంగా సొంతం చేసుకుంటోంది. అక్కడక్కడా కాంగ్రెస్ కూడా గెలిచి ఉనికి చాటుతోంది. కానీ ఖమ్మం జిల్లా ఏన్కూరులో అనూహ్యంగా కాంగ్రెస్ మద్దతుతో తెలుగుదేశం పార్టీ మండల పరిషత్‌ను కైవసం చేసుకుంది. మండలంలో 10 మంది ఎంపీటీసీలకు గానూ... ఏడుగురు సభ్యుల బలంతో ఎంపీపీగా ఆరం వరలక్ష్మీ, వైస్ ఎంపీపీగా పాశం శ్రీనివాస్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలుగుదేశం ఖాతాలో ఏన్కూరు మండల పరిషత్ - khammam
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు తెలుగుదేశం, కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకున్నాయి. మెజారిటీ సభ్యుల మద్దతుతో ఏకగ్రీవంగా పీఠం దక్కించుకున్నారు.
తెలుగుదేశం ఖాతాలో ఏన్కూరు మండల పరిషత్