తెలంగాణ

telangana

ETV Bharat / state

కాలువలో పడి తల్లిమృతి, కుమారుడు గల్లంతు - tl peta

తల్లి పొద్దున్నే లేచి కాలువలో దుస్తులు ఉతకటానికి బయలుదేరింది. సెలవులపై ఇంటికొచ్చిన పదేళ్ల కొడుకు అమ్మను విడిచి ఉండలేక ఆమెతోపాటే వచ్చాడు. తల్లితో బడి ఊసులు చెప్పుకుంటూ సంతోషంగా ఉన్న వారిని చూసి కాలం కన్నుకుట్టినట్టుంది. హఠాత్తుగా ఆ చిన్నారి నీళ్లలో జారిపోయాడు. కళ్లెదుటే కొట్టుకుపోతున్న కన్నపేగును చూసి తల్లి వెంటనే కాల్వలోకి దూకేసింది. ఈత రాని తల్లిని మృత్యుఒడికి చేర్చుకోగా కుమారుడు గల్లంతయ్యాడు.

తల్లీకొడుకుని మింగేసిన కాలువ

By

Published : Apr 13, 2019, 1:56 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం టీఎల్​పేట సమీపంలో దారుణం జరిగింది. సాగర్ కాలవలో పడి తల్లి, కొడుకు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన హుస్సేన్ బీ... తన పదేళ్ల కొడుకుతో కలిసి సమీపంలోని కాలువలో దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. ఆమె వస్త్రాలు ఉతుకుతుండగా కొడుకు నీళ్లలోకి జారిపడిపోయాడు. వెంటనే అతన్ని కాపాడే ప్రయత్నంలో తానూ నీళ్లలో పడిపోయింది. ప్రవాహ ఉద్ధృతికి ఇద్దరూ కొట్టుకుపోయారు. సమీపంలో ఉన్నవారు గుర్తించి గాలింపు చర్యలు చేపట్టగా తల్లి మృతదేహం దొరికింది. బాలుడు సాయిబాబు కోసం గాలిస్తున్నారు.

సెలవులకు వచ్చాడు.. అంతలోనే..

బోనకల్​లోని బీసీ గురుకులంలో చదువుతున్న సాయిబాబు ఈనెల 12న సెలవులపై ఇంటికొచ్చాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాలువ వద్దకు పలు గ్రామాల ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు. బాధిత కుటుంబసభ్యుల రోదన చూపరులను కంటతడి పెట్టించింది.

తల్లీకొడుకుని మింగేసిన కాలువ

ఇదీ చదవండి: అవసరానికి రాదు... అనవసరమైన వేళల్లో ఏడిపిస్తుంది

ABOUT THE AUTHOR

...view details