ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిషత్ కార్యాలయం ముందు ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు ధర్నా నిర్వహించారు. వేతనాలు 21వేలకు పెంచాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 40శాతం పని దినాల సర్క్యులర్ 4779/2019 రద్దు చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదవశాత్తైనా, సాధారణంగా మరణించినా... ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి, ఒకరికి ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసనకు సంఘీభావం
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఐదు రోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా కొనసాగుతోంది. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు సీపీఎం, సర్పంచుల ఫోరం నాయకులు సంఘీభావం తెలిపారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసనకు సంఘీభావం
ప్రస్తుతం ఉన్న ఎఫ్ఐహెచ్ఆర్ పాలసీ సవరిస్తూ ఉపాధి హామీలో చేస్తున్న మిగతా అన్ని స్థాయిల ఉద్యోగుల మాదిరిగా ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా ఎఫ్టీఈఈగా గుర్తించి, హెల్త్ కార్డులు, ప్రమోషన్లు, బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. కూలీలకు దినసరి వేతనం రూ. 350లు చెల్లించి, పదిహేను రోజుల్లో అందించాలన్నారు. ఐదు రోజులుగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమానికి సర్పంచుల ఫోరం మండల నాయకులు, సీపీఎం నాయకులు సంఘీభావం తెలిపారు.
ఇదీ చూడండి :సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం