MLA Sandra Venkataveeraiah: గోమాతను పూజించడం భారతీయ సాంప్రదాయమని.. వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 100 ట్రాక్టర్లతో ఖమ్మం గోశాలలకు పశుగ్రాసం తరలించే కార్యక్రమాన్ని తల్లాడలో ప్రారంభించారు. రింగ్ రోడ్డు కూడలిలో తొలుత గోమాతకు పూజలు నిర్వహించారు అనంతరం ఖమ్మంకు తరలిస్తున్న పశుగ్రాసం ట్రాక్టర్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
గత ఏడాది కరోనా సమయంలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 250 ట్రాక్టర్లు గోశాలలకు తరలించామని అన్నారు. గోవులు తల్లిదండ్రులతో సమానమని.. మూగజీవాలను రక్షించుకునేందుకు సత్తుపల్లి నియోజకవర్గ రైతులు కృషి చేస్తున్నారన్నారు. ర్యాలీలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.