తెలంగాణ

telangana

ETV Bharat / state

‘సేంద్రియ పద్ధతుల్లో రైతలు పంటలు పండించాలి’

సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రైతులకు సూచించారు. ఖమ్మం జిల్లాలో పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందించారు. కృత్రిమ ఎరువులు తగ్గించడానికే ప్రభుత్వం రాయితీపై ఈ విత్తనాలను రైతులకు అందిస్తుందని తెలిపారు.

mla sandra venkata veeraiahseds distribution
పచ్చిరొట్ట వత్తనాలు అందజేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

By

Published : May 23, 2021, 9:48 PM IST

రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్లులో రైతులకు రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. నూతన వ్యవసాయ విధానాలతో రైతులు మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.

సేంద్రియ పద్ధతులతో వరిసాగు చేసి.. ఆహార ధాన్యాలు కలుషితం లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కృత్రిమ ఎరువుల వాడకం తగ్గించేందుకే పచ్చిరొట్ట విత్తనాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో రూ.6 కోట్ల విలువైన విత్తనాలు అందిస్తున్నామని వెల్లడించారు.

నూతన వ్యవసాయ చట్టాల వల్లే....

దేశంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాల కారణంగా ఎఫ్‌సీఐ గోదాముల్లో గతేడాది ధాన్యం ఎక్కువగా నిలిచిపోయిందని, ఫలితంగానే ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. పరిస్థితులు ఎలా ఉన్న అధికారులతో మాట్లాడి నియోజకవర్గంలో సమస్య లేకుండా చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ రాయల వెంకటశేషగిరి రావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, డీఏవో విజయనిర్మల, ఏడీఏ నరసింహారావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: మిత్రుని ప్రాణాలు తీసిన బైకర్​ దుస్సాహసం

ABOUT THE AUTHOR

...view details