ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు 25 మందికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెక్కులు అందించారు.
'రాష్ట్రం ఆర్థిక మాంద్యంలో ఉన్నా... పథకాలు అమలు చేస్తాం' - mla sandra venkata veeryya latest news
రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు.
'రాష్ట్రం ఆర్థిక మాంద్యంలో ఉన్నా... పథకాలు అమలుచేస్తాం'
50 వేలతో ప్రారంభించిన ఈ పథకం ప్రస్తుతం లక్ష రూపాయలకు పెంచి నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక మాంద్యంలో ఉన్నా... పథకాలు జాప్యం చేయకుండా ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవీ చూడండి: భయపడే వారు ఎప్పటికీ విజయం సాధించలేరు: శైలజాకిరణ్
TAGGED:
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య