ఖమ్మం జిల్లా తల్లాడలో రైతులకు రాయితీ జీలుగు విత్తనాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పంపిణీ చేశారు. కరోనా సమయంలోనూ అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. తెలంగాణలో ఖమ్మం జిల్లాలోనే అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధిలో భాగంగా చేస్తున్న ప్రత్యేక ప్రణాళికలో కర్షకులు భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు సాగు చేసి.. లాభాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు.
నియంత్రిత సాగుతో లాభాలు: సండ్ర - mla sandra venkata veeraiah latest news
నియంత్రిత సాగు పద్ధతులతో రైతులకు లాభాలు వస్తాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడలో రాయితీ జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు.
నియంత్రిత సాగుతో లాభాలు: ఎమ్మెల్యే