ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివుని పాలెం, వేంసూర్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజల అనంతరం హరితహారంపై అవగాహన కల్పిస్తూ కిలోమీటరు వరకూ ర్యాలీ నిర్వహించారు. ముందడుగు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలకు వితరణ చేసిన రూ.30 వేల విలువైన బెంచీలను ఎమ్మెల్యే అందజేశారు. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. ప్రతిఒక్కరూ మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
మొక్కల సంరక్షణ బాధ్యత అందరిది: సండ్ర - ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. హరితహారంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు.
హరితహారం