ఆర్టీసీ సర్వీసులు లేక ప్రయాణికుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ స్వయంగా బస్సులో ప్రయాణించారు. ప్రతిరోజూ ఖమ్మం నుంచి ఇల్లెందు వెళ్తోన్న వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఇల్లందు వరకు ప్రయాణికుతలతోపాటు ఆమె కూడా వెళ్లారు. అంతకు ముందు ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి డిపో మేనేజర్‌ను కలిశారు. రాత్రిపూట ఖమ్మం నుంచి ఇల్లెందుకు బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఖమ్మం నుంచి కొత్తగూడెం, భద్రాచలం వెళ్లే బస్సులను ఇల్లెందు మీదుగా నడపాలని ఆమె కోరారు. దీనికి డీఏం సానుకూలంగా స్పందించారు.
బస్సులో ఎమ్మెల్యే హరిప్రియ ప్రయాణం - mla
ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. రాత్రిపూట బస్సుల్లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బస్సులో ఎమ్మెల్యే హరిప్రియ ప్రయాణం