రైతులను ఇబ్బంది పెట్టకూడదని అటవీశాఖ అధికారులకు ఎమ్మెల్యే హరిప్రియ సూచించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో భూములను పరిశీలించారు. మద్దులపల్లి, జాస్తిపల్లి రెవెన్యూ సరిహద్దులో 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నించడం వల్ల కొంతకాలంగా ఉద్రిక్తత నెలకొంది. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే హరిప్రియ... ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకుండా రైతులను అడ్డుకోవద్దని స్పష్టం చేశారు. పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని అప్పటి వరకు రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.
' రైతుల జోలికి అటవీ అధికారులు పోవద్దు'
అటవీ అధికారులు రైతుల జోలికి పోవద్దని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకుండా రైతులను అడ్డుకోవద్దని సూచించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని భూములను ఆమె పరిశీలించారు.
mla-haripriya