ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని ఖమ్మంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు వారిని ఆదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి - aisf
ఖమ్మం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పలు విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి