రైతు వేదిక పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
రైతు వేదిక పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రఘునాథపాలెంలో సొంత నిధులతో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. నగరంలో నూతనంగా అభివృద్ధి చేస్తున్న ఖానాపురం హవేలి చెరువును పరిశీలించారు. కట్టపై తిరుగుతూ పనులను పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న బండ్‌ను పరిశీలించారు.