ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి ఐకేపీ ఆధ్వర్యంలో శ్రీ వాణి గ్రామ సమైక్య ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని... రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడం వల్ల జిల్లాలో రైతులు ఎక్కువగా వరి సాగు చేశారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని... దళారులను నమ్మొద్దని మంత్రి సూచించారు. మొదటి రకం గ్రేడును రూ.1888, రెండో రకం రూ.1860 లకు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు.
ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. దళారులను నమ్మొద్దు: పువ్వాడ - ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని... దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కోసం వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి వివరించారు. రైతుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 60 లక్షలకు పైగా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే ఇంకా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'బీసీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉంది'