Minister Ponguleti on Dharani Portal : ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గ అధికారులతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం మాట్లాడిన మంత్రి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని, అధికారులపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు.
'కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాములవారిని ప్రార్థించాం'
ఈ నెల 20న ప్రజల ముందు శ్వేతపత్రం ఉంచుతామని పొంగులేటి పేర్కొన్నారు. ఈ నెల 28న మరో రెండు గ్యారంటీలు, సంక్రాంతి పండుగకు మిగిలిన రెండు గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామన్నారు. మరోవైపు ధరణి ప్రక్షాళన మొదలైందని, పోర్టల్‌లో తప్పులు ప్రక్షాళన చేసి నష్టం లేకుండా చేస్తామన్న మంత్రి, వీఆర్ఏల సమస్యలపై యూనియన్లతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు. అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వారిని వదిలిపెట్టం. ఈ నెల 28న మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తాం. సంక్రాంతి పండుగకు మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తాం. ఆర్థిక సంక్షోభం ఉన్నా ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం. ధరణి ప్రక్షాళన మొదలైంది. వీఆర్ఏల సమస్యలపై యూనియన్లతో చర్చించి న్యాయం చేస్తాం. - పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి
ధరణి పోర్టల్ ప్రక్షాళన మొదలైంది - వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : పొంగులేటి మంత్రి హోదాలో తొలిసారి ఖమ్మం నగరానికి కాంగ్రెస్ నేతలు - ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న హస్తం పార్టీ చెప్పినట్లుగానే 2 గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తెల్లరేషన్ కార్డుదారులకు రూ.10 లక్షల బీమా సదుపాయాలను ఇటీవలే అమలులోకి తెచ్చింది. వంద రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్న హామీ మేరకు ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ నెల 28న మరో రెండు గ్యారంటీలు, సంక్రాంతి పండుగకు మిగిలిన రెండు గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా, 6 గ్యారంటీలను అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తారో లేదో వేచి చూడాలి.
ఉచిత కరెంటు ప్రవేశ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ : పొంగులేటి శ్రీనివాసరెడ్డి