ఖమ్మం, కరీంనగర్, మంచిర్యాలలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. సీజనల్ వ్యాధుల విజృంభన, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవల్ని స్వయంగా పరిశీలించేందుకు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టిన మంత్రి... ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్తో కలిసి ఆస్పత్రిలోని అన్ని వార్డులు కలియతిరిగారు. పలు వార్డుల్లో రోగులు, వారి బంధువులతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా వైద్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విషజ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించి... వారిలో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు.
రాష్ట్రంలో మరో మూడు మెడికల్ కళాశాలలు.. - వైద్యశాఖాధికారులతో సమీక్ష సమావేశం
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన మంత్రి... రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యశాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
MINISTER EETALA VISITS KHAMMAM