కరోనా రహిత జిల్లాగా ఖమ్మం జిల్లా మారిపోయిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం గ్రామీణ మండలం కరుణగిరి సమీపంలోని రాజీవ్ గృహకల్పలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో గత 14 రోజులుగా కరోనా కేసులు నమోదు కాలేదని వారం రోజుల్లో గ్రీన్ జోన్‌గా మారిపోతుందని మంత్రి చెప్పారు. గ్రీన్ జోన్ ఏర్పడిన తర్వాత కూడా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చేతులు కడుక్కోవటం, ముఖానికి మాస్క్ పెట్టుకోవడం వంటివి కచ్చితంగా పాటించాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులు తమ దాతృత్వాన్ని చూపించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు సునీల్ రెడ్డి, అఫ్జల్ హసన్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి - corona virus latest news
రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కరుణగిరిలో మంత్రి అజయ్‌కుమార్ పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఖమ్మం కరోనా రహిత జిల్లాగా మారిందని మంత్రి తెలిపారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి
ఇవీ చూడండి: చిన్నకోడూర్ మండలంలో పర్యటించిన హరీశ్‌రావు