ఖమ్మం జిల్లాలో మిర్చి పంట కోతలకు మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలు చిక్కుకుపోయారు. లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పనులు లేక... ఈనెల 1న పిల్లలతో సహా 28 మంది నాందేడ్ జిల్లాలోని స్వగ్రామాలకు తిరుగు పయనమయ్యారు. సూర్యాపేటలోని పోలీసులు వీరిని అడ్డుకోని ఆర్టీవో కార్యాలయ ఆవరణలో ఉంచారు.
చెట్ల కింద వంట... ఆరు బయట నిద్ర - వలసకూలీలు
ఉపాధి కోసం వచ్చిన కూలీలు లాక్డౌన్లో చిక్కుకుపోయారు. స్వగ్రామాలకు బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకుని ఆర్టీవో ఆవరణలో ఉంచిన ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది.
చెట్ల కింద వంట... ఆరు బయట నిద్ర
ఆరు కిలోల బియ్యం, 500 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. పది రోజులుగా వలస కూలీలు సమీపంలోని చెట్లకిందే వంట చేసుకుంటున్నారు. వాటి కిందే సేద తీరుతున్నారు. రాత్రిపూట దోమలు నిద్ర లేకుండా చేస్తున్నాయని వాపోతున్నారు. జొన్న రొట్టెలకు అలవాటుపడ్డ తాము అన్నం తినలేకపోతున్నామని.... తమ వద్దనున్న డబ్బులూ ఖర్చయిపోయాయని తెలిపారు. స్వగ్రామాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.