ప్రతీకారం:
మావోల ప్రతీకారం.. 9వాహనాలు దగ్ధం.. - భద్రతా బలగాలు
ముగ్గురు మావోల మృతికి ప్రతీకారంగా మావోయిస్టులు 9 సాయుధుల వాహనాలకు నిప్పటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో ఆరు టిప్పర్లు, రెండు డోజర్లు, ఒక జేసీబీపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మావోల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
మావోల ప్రతీకారం.. 9వాహనాలు దగ్ధం..
అయితే అంతకుముందు రోజు సుకుమా జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో డీఆర్జీ దళాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు. ఈ ఘటనపై ఆగ్రహంతో వాహనాలు తగలబెట్టినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇవీ చూడండి: సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి