తెలంగాణ

telangana

ETV Bharat / state

"పోలీసులు, రాజకీయ నేతలు "అట్రాసిటీ"ని నిర్వీర్యం చేస్తున్నారు' - మహాజన సోషలిస్టు పార్టీ

దళితులకు, గిరిజనులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కవచ కుండలాల వలె రక్షణగా ఉంటాయని మహజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఖమ్మం జిల్లాకేంద్రంలోని ధర్నా చౌక్​లో ఎస్సీ, ఎస్టీ చట్టం కేసుల విషయంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చేపట్టిన మహాధర్నాలో ఆయన  పాల్గొన్నారు.

Manda Krishna Madiga participated Protest in Khammam
అట్రాసిటీ చట్టం.. దళితులకు కవచకుండలాలు : మందకృష్ణ మాదిగ

By

Published : Sep 21, 2020, 8:16 PM IST

ఖమ్మం ధర్నాచౌక్​లో ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. కర్ణుడికి కవచ కుండలాలు ఎలాగో.. ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ చట్టం అలా రక్షణ కల్పిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ,ఎస్టీ చట్టం కేసుల విషయంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు.

తరతరాల అణచివేత నుంచి కాపాడుకునేందుకు పోరాడి తెచ్చుకున్న చట్టం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అని.. పోలీసులు సీపీసీలోని కొన్ని లోసుగులను వినియోగించుకుని రాజకీయ వత్తిళ్లకు లొంగి.. నిందితులతో కుమ్మకై ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరు గారుస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కుట్రల్లో భాగంగా తమ వారి అమాయకత్వం, పేదరికాన్ని అడ్డుపెట్టుకుని దుర్వినియోగపరుస్తున్న విషయం వాస్తవమన్నారు. తాము తప్పుడు కేసులకు దూరంగా ఉంటామన్నారు. చట్టాన్ని పటిష్టంగా అమలు జరిపేందుకు పోరాడుతామన్నారు. జిల్లాకు చెందిన బాధితులను కలిసి పరామర్శించారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్ తరగతుల కోసం టీవీలు పంపిణీ చేసిన మంత్రి సబిత

ABOUT THE AUTHOR

...view details