ఖమ్మం జిల్లా బోనకల్లులోని శాంతి నిలయం అనాథ ఆశ్రమంలో అనేక మంది దివ్యాంగులు ఆశ్రయం పొందుతున్నారు. లాక్డౌన్తో వారికి నిత్యవసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల 1981-83 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థులు గడ్డం శ్రీనివాసరావు, దేవరపల్లి నాగేశ్వరరావు, హుస్సేన్ సాయం చేయడానికి ముందుకొచ్చారు. వారి మిత్రులంతా కలిసి రూ.లక్ష నగదుతో పాటు శాంతి నిలయం ఆశ్రమంలో ఉన్న 65 మంది మానసిక దివ్యాంగులకు రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందించారు.
మనసున్న మారాజులు.. చేయూతనిచ్చారు - మనసున్న మారాజులు.
వీరంతా అభం శుభం తెలియని పిల్లలు. ఆకలేస్తే చెప్పే స్థితిలో లేని దివ్యాంగులు. వారిని చేరదిసింది ఖమ్మం జిల్లా బోనకల్లులోని శాంతి నిలయం అనాథ ఆశ్రమం. లాక్డౌన్తో వీరికి బియ్యం లేకపోవటంతో స్పందించిన కొందరు సాయం చేశారు. మేమున్నామంటూ ధైర్యం చెప్పారు.
మనసున్న మారాజులు.. చేయూతనిచ్చారు