ఖమ్మం జిల్లా మధిరలో శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం కన్నులపండువగా సాగింది. వసంత నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా పురవీధుల్లో విద్యుత్ దీపాలతో అలంకరించిన వాహనంపై స్వామివారిని ఊరేగించారు. ఈ వేడుకలో భక్తులు భారీగా హాజరై.. రఘురాముని ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో యువత బాణాసంచా పేలుస్తూ నృత్యాలు చేశారు.