కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ సంస్కరణలతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతుందని వామపక్ష పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లును నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో ధర్నా నిర్వహించారు.
'వ్యవసాయ బిల్లులతో రైతులకు తీవ్ర నష్టం'
నూతన వ్యవసాయ బిల్లులు రైతులకు ఎటువంటి లాభం చేకూర్చవని వామపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లును నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో ధర్నా నిర్వహించారు.
'వ్యవసాయ బిల్లులతో రైతులకు తీవ్ర నష్టం'
రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న చట్టాలను మార్చాలని చూస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ బిల్లు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉంటుందన్నారు. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని, వ్యవసాయ ఉత్పత్తులకు గుట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి:'వ్యవసాయ బిల్లులతో బానిసలుగా రైతులు'