ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సిబ్బందికి నిర్లక్ష్యం వదలడం లేదు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దవాఖానాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బాలింతలకు సెక్యూరిటీ గార్డులు, గదులు శుభ్రం చేసే సిబ్బందే చికిత్స చేస్తున్నారు. వారే సెలైన్ ఎక్కించడం, ఇంజక్షన్ వేయడం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే నర్సులు వచ్చే విధంగా చూడాలని రోగులు కోరుతున్నారు.
అక్కడ సెక్యూరిటీ గార్డే నర్సు - security gaurd
ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి సర్కార్ దవాఖానాలను అభివృద్ధి చేస్తుంటే అందులో పని చేసే సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సిబ్బంది రాక సెక్యూరిటీ గార్డే నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
వైద్యం చేస్తున్న సెక్యూరిటీ గార్డు