తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఖమ్మం జడ్పీ ఛైర్మన్

ఖమ్మం జడ్పీ ఛైర్మన్​ కమల్​రాజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులో భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణం చేయాలని ప్రయాణికులకు సూచించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులకు మాస్కులు, శానిటైజర్లను జడ్పీ ఛైర్మన్ కమల్​రాజు అందజేశారు.

khammam zp chairman traveled in RTC bus in khammam district
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఖమ్మం జడ్పీ ఛైర్మన్

By

Published : May 22, 2020, 11:02 PM IST

లాక్​డౌన్ ప్రారంభమైన చాలా రోజుల అనంతరం కదిలిన ఆర్టీసీ బస్సులో ఖమ్మం జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్​రాజు శుక్రవారం ప్రయాణించారు. మధిర ఆర్టీసీ డిపో నుంచి జిల్లా కేంద్రంతో పాటు రాజధానికి నడుపుతున్న సర్వీసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

బస్సులో భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాలని అవగాహన కల్పించారు. తెరాస నాయకులతో కలిసి మధిర డిపో నుంచి కొద్ది దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులకు మాస్కులు, శానిటైజర్లను జడ్పీ ఛైర్మన్​ పంపిణీ చేశారు.

ఇవీ చూడండి: 'అవ్వా.. బాగున్నావా... పానం ఎట్లుంది'

ABOUT THE AUTHOR

...view details