ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే దాతల సహృదయం ఎంతో గొప్పదని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని టీవీఎం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి నుంచి వచ్చిన కూలీలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
'పేదలకు అండగా నిలిచే హృదయం ఎంతో గొప్పది' - వలస కూలీలకు సరకుల పంపిణీ
కొవిడ్-19 నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను దాతలు ఆదుకోవాలని ఖమ్మం జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో టీవీఎం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వలస కూలీలకు సరకులు పంపిణీ చేశారు.
'పేదలకు అండగా నిలిచే హృదయం ఎంతో గొప్పది'
కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను గుర్తించి దాతలు తమకు చేతనైన సాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: లాక్‌డౌన్ విధింపుపై సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందంటే..?