రక్షక భటులంటే శాంతిభద్రతల పరిరక్షణ, సమాజానికి సేవచేసే పౌరులని ఖమ్మం జిల్లా పోలీసులు నిరూపించారు. ఏన్కూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లే రహదారి.. వర్షాల కారణంగా బురదమయంగా మారింది. అక్కడి విద్యార్థులు, రోగుల కష్టాలను తెలుసుకున్న పోలీసులు ఆ రహదారి నిర్మాణానికి ముందడుగు వేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జూనియర్ కళాశాలకు వెళ్లిన సత్తుపల్లి ఏసీపీ వెంకటరావు, ఏన్కూర్ ఎస్సై పవన్ కుమార్‌కు విద్యార్థులు తమ కష్టాలు వివరించారు. దీనిపై స్పందించిన ఏసీపీ, పోలీసుల సహకారంతో ఆ రోడ్డును బాగు చేయించారు. విద్యార్థులతోపాటు ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు, 108 వాహన ప్రయాణానికి ఇబ్బందులు తీర్చారు.
రహదారికి ఖమ్మం పోలీసుల మరమ్మతులు - సమాజ సేవ
పోలీసులు అంటే శాంతి భద్రతలే కాకుండా సమాజ సేవ కూడా చేస్తారని ఖమ్మం పోలీసులు నిరూపించారు. బురదమయంగా మారిన రోడ్డుకు మరమ్మత్తులు చేయించారు.
రహదారికి ఖమ్మం పోలీసుల మరమ్మతులు
ఇదీ చూడండి: కశ్మీర్‌కు మరో 28వేల మంది భద్రతా బలగాలు