తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు' - చివరిరోజు ప్రచారంతో హోరెత్తిన ఖమ్మం

ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీనితో ఖమ్మంలో ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు.

Khammam Corporation election trs campaign
Khammam Corporation election trs campaign

By

Published : Apr 27, 2021, 2:25 PM IST

కార్పొరేషన్ ఎన్నికల చివరిరోజు ప్రచారంతో ఖమ్మం హోరెత్తుతోంది. ఆయాపార్టీల అభ్యర్థులకు మద్దతుగా నేతలంతా రంగంలోకి దిగి ప్రచారం చేపడుతున్నారు. తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ ముఖ్య నేతలంతా నగరంలో మోహరించి ప్రచారం చేపడుతున్నారు.

50వ డివిజన్​లో తెరాస అభ్యర్థి శరత్​కు మద్దతుగా వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రవతి ప్రచారం నిర్వహించారు. డివిజన్​లో తెరాస శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్​కు ప్రజలు అండగా ఉండాలని నేతలు కోరుతున్నారు.

ఇదీ చూడండి:పది రెట్లు ధర పెంచి కరోనా మందుల అమ్మకం..!

ABOUT THE AUTHOR

...view details