ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులతో తహసీల్దార్ శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రైతులు జాతీయ రహదారి నిర్మాణ సర్వే పనులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా అధికారులు సర్వే చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. రెండు మూడు పంటలు పండే భూముల్లో రహదారి నిర్మాణం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ఎకరాకు రూ. 40 లక్షలు ఇస్తేనే తమ భూములు జోలికి రావాలని.. ధర నిర్ణయించకుండా దౌర్జన్యంగా మా భూముల్లో సర్వే చేస్తే ఊరుకోమని రైతులు హెచ్చరించారు.
"దౌర్జన్యంగా భూముల్లో సర్వే చేస్తే ఊరుకోం" - farmers
ఖమ్మం జిల్లాలోని పాతకారాయిగూడెంలో గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న అన్నదాతలతో తహసీల్దార్ శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. రైతులు ఎకరాకు రూ.40లక్షల పరిహారమిస్తేనే తమ భూముల జోలికి రావాలని స్పష్టం చేశారు.
దౌర్జన్యంగా భూముల్లో సర్వే చేస్తే ఊరుకోం