ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం గంగుల నాచారంలో పెద్దమ్మ తల్లి జాతర వైభవంగా జరిగింది. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం గిరిజనులు అమ్మవారిని ఊరేగించి ప్రత్యేక సంబురాలు నిర్వహించారు. పెద్దమ్మ తల్లి, పోతురాజు విగ్రహాలతో నృత్యాలు చేస్తూ రాత్రంతా జాతర చేశారు. ఆదివాసీలు సామూహికంగా నృత్యం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐదు రోజులుగా గ్రామంలో నిర్వహిస్తున్న ఈ జాతరలో భాగంగా చివరి రోజు అమ్మవారికి బోనాలు సమర్పించారు.
గంగుల నాచారంలో ఘనంగా పెద్దమ్మ తల్లి జాతర - jatara
ఖమ్మం జిల్లా గంగుల నాచారంలో ఆదీవాసీలు పెద్దమ్మ తల్లి జాతరను ఘనంగా జరిపారు. సామూహికంగా నృత్యాలు చేస్తూ అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.
గంగుల నాచారంలో ఘనంగా పెద్దమ్మ తల్లి జాతర
TAGGED:
jatara