సమస్యలపై కదం తొక్కిన విద్యార్థులు - విద్యార్థుల ధర్నా
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన , మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థులు కదం తొక్కారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మహిళా జూనియర్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు వందలాది మంది ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలుచేయాలని, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. అధ్యాపకులు కొరత తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.