తెలంగాణ

telangana

అడవి పందుల అక్రమ రవాణా, ఇద్దరి అరెస్టు

By

Published : Jun 6, 2020, 1:05 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడలో అక్రమంగా తరలిస్తున్న పన్నెండు అడవి పందులను పోలీసులు పట్టుకున్నారు. ఒక బొలేరో వాహనం సీజ్​ చేసి.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

illegal wild pigs transportation persons were arrested by the khammam police
అడవి పందుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట

ఆదిలాబాద్ జిల్లా పోచారం మండలం నుంచి బొలెరో వాహనంలో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి అడవి పందులను తరలిస్తుండగా ఖమ్మం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఒక వాహనాన్ని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

12 అడవి పందులలో నాలుగు మృతి చెందగా మిగతా వాటిని కల్లూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేందుకు అటవీశాఖ సిబ్బంది చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:ఐదు రోజులు... ఆరు హత్యలు...

ABOUT THE AUTHOR

...view details