తెలంగాణ

telangana

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించకుంటే ఉగ్రరూపమే..

సమస్యల పరిష్కరించకుంటే తాము చేపట్టిన సమ్మె ఉగ్రరూపం దాల్చుతుందని పారిశుద్ధ్య కార్మికులు హెచ్చరించారు. ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన

By

Published : Jul 5, 2019, 12:45 PM IST

కోర్టు తీర్పును అనుసరించి తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న టోకెన్ సమ్మెలో భాగంగా ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. వేతనాలను రూ. 24 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన

ABOUT THE AUTHOR

...view details