ఖమ్మంలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నివాసాల్లోకి మురుగు కాలువలు పొంగి నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఖమ్మంలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం - Khammam Latest News
ఖమ్మంలో తెల్లవారు జాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి.
ఖమ్మంలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం
ఇంట్లోకి వచ్చిన నీటిని బయటకు ఎత్తి పోసుకున్నారు. నగరంలోని మయూరి కూడలి బస్టాండ్, ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుపైకి నీరు చేరింది. నగరంలోని కవిరాజ్ నగర్ వికలాంగుల కాలనీ విజయనగర్ కాలనీ సుందరయ్య నగర్ మూడో పట్టణ ప్రాంతాల్లోని కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇదీ చదవండి:ఆ రెండు ప్రాజెక్టుల నిర్వహణ మాకే ఇవ్వాలి: కేసీఆర్
Last Updated : Oct 7, 2020, 12:04 PM IST