క్రీస్తు జ్యోతి కళాశాలలో హరిత దినోత్సవం - lions club
ఖమ్మం జిల్లాలో క్రీస్తు జ్యోతి కళాశాలలో హరితదినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో వృక్ష సంపద గొప్పదనాన్ని చాటారు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెం క్రీస్తు జ్యోతి కళాశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హరిత దినోత్సవం నిర్వహించారు. పచ్చదనం ప్రత్యేకత చాటుతూ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గీతాలు, నృత్యాలతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అడవులు పరిరక్షణకు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి కృషి చేయాలని కోరారు.