ఖమ్మం జిల్లా మధిరలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రం మధిరలోని బంజారా కాలనీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహిళలు గోపూజ చేపట్టారు. శ్రావణమాసం శుక్రవారం కావడం వల్ల లక్ష్మీ దేవికి పసుపు కుంకుమలతో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు - శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం
శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని పలు ఆలయాల్లో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.
లక్ష్మీ దేవికి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు